logo

ఏఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించిన ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం శేషగిరి భవన్లో ఏఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా పాల్గొని పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ 1959 మే 3 వ తారీఖున న్యూఢిల్లీలో ఏఐవైఎఫ్ ఆవిర్భవించిందని ఈ 65 సంవత్సరాల్లో అనేక పోరాటాలు నిర్వహించారని 18 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వారికి ఓటు హక్కు కల్పించిన ఘనత యువజన సంఘానికి ఉందని విద్యా వైద్యం ఉపాధి కోసం అనేక పోరాటాలు చేసి నా ఘనత ఏఐవైఎఫ్ కి ఉందని ఆయన అన్నారు దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలపై గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి వరకు యువత పోరాటాలు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో ప్రధాన పాత్ర పోషించాలని అదేవిధంగా *BNEGA* పార్లమెంట్లో భగత్ సింగ్ నేషనల్ గ్యారెంటీ స్కీంను చట్టంగా అమలు చేయాలని యువత ఉద్యమ బాటలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు దేశంలో ఒకవైపు నరేంద్ర మోడీ పాలన మత ఉద్దేశాలను రెచ్చగొడుతూ మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నరేంద్ర మోడీని గద్ద దింపే దాంట్లో యువత ప్రధాన పాత్ర పోషించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాస్, సిపిఐ సీనియర్ నాయకులు నెరేల్ల రమేష్, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి బరిగెల భూపేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే ఖయ్యూం, ఏఐవైఎఫ్ నాయకులు ఎండి ఇర్ఫాన్ , రసూల్ పాషా, పవన్, చింటూ ఎండి జహీర్ అలీ, లింగేష్ రవి చిరంజీవి సంతోష్ తదితరులు పాల్గొన్నారు

0
0 views